News March 17, 2025
అనంతపురం: వివాహితపై అత్యాచారయత్నం

ఉమ్మడి అనంత జిల్లా నార్పలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నార్పలలో ఉండే లక్ష్మణ్ అనే వ్యక్తి కవిత అనే వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకుని, ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. కవితను లక్ష్మణ్ వేధించేవాడని, అతడే చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కైలుట్లయ్య తెలిపారు.
Similar News
News February 25, 2026
మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.
News February 25, 2026
అర్జునుడి ప్రాణాలు కాపాడిన ఘటోత్కచుడు

కురుక్షేత్రంలో ఘటోత్కచుడి త్యాగం అసమానం. కర్ణుడి వద్ద ఉన్న అజేయమైన ‘వాసవి శక్తి’ నుంచి అర్జునుడిని రక్షించడమే ఇందుకు కారణం. యుద్ధంలో ఘటోత్కచుడు తన శక్తులతో కౌరవ సేనను అతలాకుతలం చేస్తుంటే, గత్యంతరం లేక కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచుడిపైనే ప్రయోగించాల్సి వచ్చింది. అలా ఘటోత్కచుడు వీరమరణం పొంది, అర్జునుడి ప్రాణాలు కాపాడి పాండవుల విజయానికి కారణమయ్యాడు. చనిపోతూ తన భారీ దేహంతో కౌరవ సైన్యాన్ని అణిచివేశాడు.
News February 25, 2026
ఆర్టీసీలో సమ్మె సైరన్.. మార్చి 13 డెడ్‌లైన్

TG: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, జీతాల పెంపు, పెండింగ్ బకాయిల విడుదల సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. JAC ఆధ్వర్యంలో నిన్న HYDలోని ఇందిరా పార్కు వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా చేశారు. మార్చి 13లోపు డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె నోటీసు ఇచ్చి మార్చి 18 తర్వాత స్ట్రైక్ చేస్తామని హెచ్చరించారు.


