News March 24, 2024
IT కంపెనీలో జాబ్.. గంజాయి విక్రయం

ఐటీ కంపెనీలో పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలానికి చెందిన యాపుగంటి ఫణికుమార్‌ను మాదాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఫణికుమార్ మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ జల్సాలకు అలవాటు పడి, డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి 18కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇతడు మాదకద్రవ్యాలు అమ్ముతూ గతంలోనూ పట్టుబడ్డాడు.
Similar News
News March 5, 2026
నేటి నుంచి జిల్లాలో జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా మార్చి 6 నుంచి 8 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన రాజమండ్రి చేరుకుంటారు. శనివారం ఎస్సీల సంక్షేమం, రక్షణాత్మక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కోనసీమ జిల్లాకు వెళతారు. పర్యటన ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News March 4, 2026
రాజమండ్రిలో విద్యుత్ ఘాతానికి గురైన విద్యార్థులు

రాజమండ్రి అనుశ్రీ థియేటర్ వద్ద ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం విద్యుత్ ఘాతానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్ రామ్ విద్యార్థులను పరామర్శించారు. 15వ వార్డు చెందిన యన్.రమేశ్, 27వ వార్డు చెందిన ఉజ్వల ఈశ్వర సాయిలు మామిడికాయలు కోయడానికి వెళ్లే ప్రయత్నంలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. అధికారులు స్పందించాలని భరత్ కోరారు.
News March 4, 2026
తూ.గో: మొబైల్ వాడొద్దన్నారని..!

బిక్కవోలు మండలం బలబద్రపురంలో అదృశ్యమైన బాలికను ఐదు గంటల్లోనే గుర్తించినట్లు SI రవిచంద్ర కుమార్ తెలిపారు. మొబైల్ ఎక్కువగా వాడుతోందని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చేపట్టి బాలిక ఆచూకీ కనిపెట్టారు. అనంతరం ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.


