News March 17, 2025

ధర్పల్లి: మల్లయ్యను చంపిన భార్య, కొడుకు

image

ధర్పల్లి (M) హోన్నాజిపేట్లో మల్లయ్య హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన మల్లయ్యకు కొన్నెళ్లుగా భార్యతో, కొడుకుతో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం తండ్రీకొడుకులు గొడవపడగా విషయాన్ని తల్లికి చెప్పాడు. దీంతో తల్లీకొడుకులు మల్లయ్యతో గొడవపడి కొందకు పడేసి, బీరుసీసాతో తలపై కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News November 16, 2025

RRB PO అడ్మిట్ కార్డులు విడుదల

image

IBPS RRB PO(Officer Scale-I) ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in/లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పాస్‌వర్డ్‌తో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ 22, 23 తేదీల్లో జరగనుంది. మెయిన్స్ అడ్మిట్ కార్డులు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య అందుబాటులోకి వస్తాయి. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా 3,928 పోస్టులను భర్తీ చేయనున్నారు.

News November 16, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

☛ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా రిలీజ్ డేట్‌లో మార్పు.. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే (NOV 27) థియేటర్లలోకి సినిమా.. ఈ నెల 18న ట్రైలర్
☛ నాగార్జున ‘శివ’ రీరిలీజ్‌కు 2 రోజుల్లో ₹3.95Cr గ్రాస్ కలెక్షన్స్
☛ నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా త్వరలో సినిమా: సినీ వర్గాలు
☛ ధనుష్ డైరెక్షన్‌లో రజినీ హీరోగా సినిమా తెరకెక్కే అవకాశం: తమిళ సినీ వర్గాలు

News November 16, 2025

గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.