News March 17, 2025

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించం: మంత్రి పొంగులేటి

image

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిన్న ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. పేదల కలలను సాకారం చేస్తూ మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చామన్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టేవిధంగా ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందన్నారు.

Similar News

News March 17, 2025

నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడి

image

పాల్వంచలో దారుణం జరిగింది. పొలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన శివకుమార్ నాలుగో తరగతి చదివే ఓ బాలికకు చాక్లెట్ ఇస్తానని నమ్మబలికాడు. డాబా పైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. కాగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News March 17, 2025

KMM: ప్రేమించుకుని పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

News March 17, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

error: Content is protected !!