News March 17, 2025
వనపర్తి: చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి

వీపనగండ్ల మండల పరిధిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కల్వరాలకు చెందిన నర్సింహ(62) నాన్‌చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వెళ్లిన ఆయన ఎంతకు తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు చెరువులో గాలించగా ఆదివారం నర్సింహ మృతదేహం కనిపించింది. ఈమేరకు కేసు నమోదైంది.
Similar News
News November 4, 2025
రైల్వే స్టేషన్లలో సమస్యలపై ప్రస్తావించాం: VZM ఎంపీ

విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో వేచి ఉండే హాల్, మరుగుదొడ్లు, ఎస్కలేటర్లు, తదితర సదుపాయాలు కల్పించాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. విశాఖలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి హాల్ట్, భువనేశ్వర్, తిరుపతి రైళ్లను ప్రతిరోజూ నడపడం, శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.
News November 4, 2025
కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆయన కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీ నుంచి కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు మొదలవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర, తదితరులు పాల్గొన్నారు.
News November 4, 2025
కాకినాడ జిల్లాలో 20,113 హెక్టార్లలో పంట నష్టం అంచనా.!

కాకినాడ జిల్లాలో 20,113 హెక్టార్లలో 45 వేల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక పంపారు. దీనిపై అభ్యంతరాలు తీసుకున్నారు. బుధవారం తుది జాబితాను ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు చొప్పున పరిహారం అందుతుందని ఆయన పేర్కొన్నారు.


