News March 17, 2025

సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య

image

యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ కథనం మేరకు.. హవేలీ ఘనపూర్ నుంచి సంగారెడ్డికి వలస వచ్చిన మన్నే వినోద్ (21) కొంతకాలంగా శివాజీ, మరియమ్మ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 15న తన ఇంట్లో హత్య చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 17, 2025

సీతానగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సీతానగరం మండలం జగ్గు నాయుడుపేట సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం తాంబరం నుంచి చక్రధరపూర్ వెళ్తున్న రైలు నుంచి ప్రధాన్ హం బోరో (23) జారి పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విజయనగరం తరలించామన్నారు.

News March 17, 2025

పూరీ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సినిమా?

image

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పూరీ చెప్పిన కథ సేతుపతిని మెప్పించిందని, సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ లేదా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా పూరీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News March 17, 2025

నల్గొండ: 35 మంది అర్జీదారులతో మాట్లాడిన ఎస్పీ 

image

పోలీసు గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈరోజు పరిశీలించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

error: Content is protected !!