News March 17, 2025
MBNR: ప్రేమ పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Similar News
News January 16, 2026
ఇంటి సింహద్వారం ఎలా ఉండాలంటే?

ఇంటికి సింహద్వారం ఎంతో ప్రధానమైనదని, ఇది ఇంటి యజమాని అభిరుచికి, ఉన్నతికి నిదర్శనమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘సింహద్వారం ఏ దిశలో ఉన్నా దానికి రెండు వైపులా కిటికీలు ఉండటం శాస్త్రరీత్యా తప్పనిసరి. మిగిలిన ద్వారాల కంటే ఇది ఎత్తులోనూ, వెడల్పులోనూ పెద్దదిగా ఉండాలి. ప్రత్యేకమైన ఆకర్షణతో ఉట్టిపడాలి. అప్పుడే ఆ ఇంటికి నిండుదనం, వాస్తు బలం చేకూరుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 16, 2026
ప్రజల్లో మమేకమై పనిచేయాలి: ఎంపీ రఘునందన్

బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మమేకమై పని చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సిద్దిపేట నాయకుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. MP మాట్లాడుతూ ప్రజలకు చేరువయ్యేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తొడుపునూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
News January 16, 2026
వేములవాడ: జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ వద్ద జంక్షన్ అభివృద్ధి పనులను రూ. కోటితో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రారంభించారు.


