News March 17, 2025
ఏలూరు : ‘ఒక్కనిమిషం..వారి గురించి ఆలోచిద్దాం’

మరి కాసేపట్లో ఏలూరు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 133 కేంద్రాలలో 25,179 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్వహణకు 62 మంది కస్టోడియన్లు, 1,120 మంది ఇన్విజిలేటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే పరీక్షా కేంద్రాల వద్దకు టెన్షన్ టెన్షన్ గా చేరుకుంటున్న విద్యార్థుల కోసం ఒకసారి ఆలోచిద్దాం. వీలైతే వారిని పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చి మన వంతు సాయం చేద్దాం.
Similar News
News November 5, 2025
జగిత్యాల: శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివ లింగం ఎక్కడుందంటే?

త్రేతాయుగంలో లంక యుద్ధం అనంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వెళ్తూ ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పట్లో ఆయన రాక్షస సంహారం చేసిన పాప విమోచనార్థం శివారాధన చేయాలని సంకల్పించి, స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగమే శ్రీ రామలింగేశ్వర స్వామి. కాలక్రమేణా ఆ ప్రదేశం మల్లాపూర్ మండలం “వాల్గొండ”గా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా భక్తులు ఇక్కడికి వచ్చి రామ-శివుల ఆరాధనతో పుణ్యఫలం పొందుతున్నారు.
News November 5, 2025
GNT: ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా సీసీఐకి విక్రయించాలి

పత్తి రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారానే పత్తి విక్రయం చేయవచ్చని CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్మాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐఓఎస్‌లో ఉన్న ‘కపాస్ కిసాన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకుని నాణ్యమైన, బాగా ఆరబెట్టిన పత్తిని CCI కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
News November 5, 2025
డెలివరీ తర్వాత బెల్టు వాడితే పొట్ట తగ్గుతుందా?

ప్రసవం తర్వాత పొట్టను తగ్గించడానికి చాలామంది అబ్డామినల్ బెల్టును వాడతారు. అది పొట్ట కండరాలకు ఆసరాగా, సౌకర్యంగా ఉంటుంది కానీ పొట్టను తగ్గించడంలో ఉపయోగపడదంటున్నారు నిపుణులు. వదులైన మజిల్స్ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే వ్యాయామం తప్పనిసరి అని చెబుతున్నారు. క్రంచెస్, స్ట్రెయిట్ లెగ్ రైజింగ్, ప్లాంక్స్ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట తగ్గుతుందని సూచిస్తున్నారు.


