News March 17, 2025
జిల్లాలో 128 కేంద్రాలు.. 26,497 విద్యార్థులు

పల్నాడు జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు మొత్తం 128 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈవో చంద్రకళ తెలిపారు. ఆ పరీక్షా కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 12,869 మంది రెగ్యులర్ బాలురు, 12,778 మంది రెగ్యులర్ బాలికలు ఉన్నారు.586 మంది ప్రైవేట్ బాలురు,304 మంది బాలికలు ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్నారు. 6గురు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 6 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు.
Similar News
News March 17, 2025
సీతానగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సీతానగరం మండలం జగ్గు నాయుడుపేట సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం తాంబరం నుంచి చక్రధరపూర్ వెళ్తున్న రైలు నుంచి ప్రధాన్ హం బోరో (23) జారి పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విజయనగరం తరలించామన్నారు.
News March 17, 2025
పూరీ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సినిమా?

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పూరీ చెప్పిన కథ సేతుపతిని మెప్పించిందని, సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ లేదా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా పూరీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News March 17, 2025
నల్గొండ: 35 మంది అర్జీదారులతో మాట్లాడిన ఎస్పీ

పోలీసు గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈరోజు పరిశీలించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.