News March 17, 2025

వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా కానాయిపల్లిలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేరు 42.1, విలియంకొండ 41.6, పెద్దమందడి 41.1, వనపర్తి 40.7, రేమద్దుల 40.7, గనపూర్ 40.4, వెలుగొండ 40.4, రేవల్లి 40.3, ఆత్మకూర్ 40.3, మదనపూర్ 39.9, దగడ 39.9, పాన్గల్ 39.6, సోలిపూర్ 39.6, గోపాల్ పేట 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 17, 2025

AP న్యూస్ రౌండప్

image

* YSR జిల్లాను YSR కడప జిల్లాగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం
* భోగాపురం ఎయిర్‌పోర్టులో బాంబు పేలి ఒకరి మృతి
* తెనాలి: స్పెషల్ తెలుగుకు బదులు తెలుగు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఇన్విజిలేటర్ సస్పెండ్
* కోనసీమ(D) నెలపతిపాడులో పిల్లలను కాలువలో తోసి తండ్రి సూసైడ్.. బాలుడు(10) సురక్షితం, బాలిక(6) మృతి
* చిత్తూరు TDP కార్యకర్త హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
* తిరుమలలో BCY పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్ నిరసన..అరెస్ట్

News March 17, 2025

విశాఖలో చిన్నారి మృతి.. ట్విస్ట్ ఏంటంటే?

image

విశాఖలో కన్న <<15787560>>బిడ్డను<<>> చంపిన దారుణం తెలిసిందే. ఈ ఘటనలో ఆసక్తికర విషయాలను సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. హనుమంతువాక పెద్దగదిలికి చెందిన భార్యాభర్తలకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో భార్య శిరీష తన 5 నెలల చిన్నారిని ఇంట్లోనే దిండుతో అదిమి చంపేసింది. ఆ తర్వాత తెన్నేటి పార్క్ వద్ద ఉన్న బీచ్‌కు వెళ్లి.. పాప నీటిలో మునిగి చనిపోయినట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త ఫిర్యాదుతో అసలు నిజం తెలిసింది. 

News March 17, 2025

రామగిరి ఎస్సై సుధాకర్ ఇన్‌స్టా పోస్టు వైరల్

image

రామగిరి ఎస్ఐ సుధాకర్ చేసిన ఓ పోస్ట్ వైరలవుతోంది. ‘మా నాన్న జాగీర్లు ఇవ్వలేదు. కానీ ఎవరికీ తలవంచని ధైర్యం ఇచ్చారు’ అంటూ ఆయన తన తండ్రితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవల రామగిరి ఎస్ఐపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ‘పోలీస్ స్టేషన్ ఏమైనా నీ అయ్య జాగీరా?’ అని ఎస్ఐను ప్రశ్నించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలోనే ఎస్ఐ తాజా పోస్ట్ వైరలవుతోంది. 

error: Content is protected !!