News March 17, 2025

1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

image

TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది. తాజాగా పలువురు నెటిజన్లు వీటిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి సజ్జనార్ తోడవ్వడంతో ప్రమోటర్స్‌పై ప్రభుత్వం చర్యలకు దిగింది.

Similar News

News November 12, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 2

image

9. మానవులు మానవత్వముని ఎట్లు పొందుతారు? (జ.అధ్యయనం వలన), 10. మానవునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి? (జ. తపస్సుతో సాధుత్వం, శిష్టాచార భ్రష్టతవంతో అసాధుభావం సంభవిస్తాయి.)
11. మానవుడు మనుష్యుడెలా అవుతాడు? (జ.మృత్యు భయము వలన)
12. జీవన్మృతుడెవరు? (జ.దేవతలకు, అతిధులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 12, 2025

ఢిల్లీ పేలుడు.. అల్ ఫలాహ్‌లో మరో డాక్టర్ మిస్సింగ్?

image

ఢిల్లీ <<18253549>>పేలుడు<<>>కు సంబంధించి అల్ ఫలాహ్ వర్సిటీకి చెందిన మరో డాక్టర్ పేరు బయటికొచ్చింది. బ్లాస్ట్ తర్వాత డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇతడు గతంలో కశ్మీర్‌లోని SMHS ఆస్పత్రిలో పని చేశాడు. అయితే టెర్రర్ లింక్స్ ఉన్నాయనే అనుమానంతో 2023లో J&K లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించడం గమనార్హం. ఆ సమయంలో అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అల్ ఫలాహ్ వర్సిటీలో నిసార్ జాయిన్ అయ్యాడు.

News November 12, 2025

రేపు 9AMకి బిగ్ అనౌన్స్‌మెంట్: లోకేశ్

image

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను ఆపేసింది. మళ్లీ తుఫాను మాదిరిగా ఏపీకి రాబోతోంది. రేపు ఉ.9 గం.కు పెద్ద ప్రకటన చేస్తాం. రెడీగా ఉండండి’ అని ట్వీట్ చేశారు. మరోవైపు CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌పై లోకేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందని, అందుకే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.