News March 17, 2025

బీసీ ఎమ్మెల్యేలతో మంత్రుల సమావేశం

image

బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లు సజావుగా అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలన్నారు.

Similar News

News March 17, 2025

NRPT: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.

News March 17, 2025

నియోజకవర్గానికి 4-5వేల మందికి సాయం: సీఎం రేవంత్

image

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం అమలు చేస్తామని CM రేవంత్ తెలిపారు. ఒక్కొక్కరికి ₹50వేల నుంచి ₹4లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. ‘రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 2న 5లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 4-5వేల మందిని ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.

News March 17, 2025

‘ఫ్యామిలీ రూల్‌’పై అనుష్క శర్మ పోస్ట్.. వైరల్

image

బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రూల్‌’పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పరోక్షంగా స్పందించారు. ‘నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా టూర్లలో క్రికెటర్లతోపాటు వారి కుటుంబాలు, సన్నిహితులు ఉంటే బాగుంటుందని విరాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!