News March 24, 2024

KNR: ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డే కు చిట్టాపూర్ వచ్చాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్ళాడు. శివకుమార్‌కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News October 31, 2024

కొండగట్టు దేవస్థానంలో దీపావళి వేడుకలు

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండగట్టు ఆంజనేయ దేవస్థానంలో గురువారం దీపావళి వేడుకలు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో దీపకాంతులతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News October 31, 2024

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు

image

దీపావళి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలోని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీగణపతి, శ్రీ అనంతనాగేంద్ర స్వామి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల ప్రత్యేక అలంకరణ మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

News October 31, 2024

Way2 Special.. కరీంనగర్: శ్మశానంలో దీపావళి!

image

దీపావళిని సాధారణంగా ఇంట్లో అందరితో కలిసి టపాసులు కాల్చుతూ జరుపుకుంటారు. కానీ, మన కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపు 6 దశాబ్ధాల నుంచి శ్మశాన వాటికలో జరుకుంటున్నారు. అదెక్కడో కాదండోయ్! నగరంలోని కార్ఖనగడ్డ వద్ద గల హిందూ శ్మశాన వాటికలో. ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరణించిన తమ బంధువుల సమాధుల వద్ద నైవేద్యాలు, కొవ్వొత్తులు వెలిగించి, పిండివంటలు పెట్టి టపాసులు కాలుస్తూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.