News March 17, 2025
పల్నాడు జిల్లాలో పలువురు పోలిస్ సిబ్బంది బదిలీలు

పల్నాడు జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని బదిలీలు చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలిస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే విధంగా పలువురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీలు చేస్తూ, పోస్టింగ్స్ ఇచ్చారు.
Similar News
News March 17, 2025
AP న్యూస్ రౌండప్

* YSR జిల్లాను YSR కడప జిల్లాగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం
* భోగాపురం ఎయిర్‌పోర్టులో బాంబు పేలి ఒకరి మృతి
* తెనాలి: స్పెషల్ తెలుగుకు బదులు తెలుగు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఇన్విజిలేటర్ సస్పెండ్
* కోనసీమ(D) నెలపతిపాడులో పిల్లలను కాలువలో తోసి తండ్రి సూసైడ్.. బాలుడు(10) సురక్షితం, బాలిక(6) మృతి
* చిత్తూరు TDP కార్యకర్త హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
* తిరుమలలో BCY పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్ నిరసన..అరెస్ట్
News March 17, 2025
విశాఖలో చిన్నారి మృతి.. ట్విస్ట్ ఏంటంటే?

విశాఖలో కన్న <<15787560>>బిడ్డను<<>> చంపిన దారుణం తెలిసిందే. ఈ ఘటనలో ఆసక్తికర విషయాలను సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. హనుమంతువాక పెద్దగదిలికి చెందిన భార్యాభర్తలకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో భార్య శిరీష తన 5 నెలల చిన్నారిని ఇంట్లోనే దిండుతో అదిమి చంపేసింది. ఆ తర్వాత తెన్నేటి పార్క్ వద్ద ఉన్న బీచ్‌కు వెళ్లి.. పాప నీటిలో మునిగి చనిపోయినట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త ఫిర్యాదుతో అసలు నిజం తెలిసింది.
News March 17, 2025
రామగిరి ఎస్సై సుధాకర్ ఇన్‌స్టా పోస్టు వైరల్

రామగిరి ఎస్ఐ సుధాకర్ చేసిన ఓ పోస్ట్ వైరలవుతోంది. ‘మా నాన్న జాగీర్లు ఇవ్వలేదు. కానీ ఎవరికీ తలవంచని ధైర్యం ఇచ్చారు’ అంటూ ఆయన తన తండ్రితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవల రామగిరి ఎస్ఐపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ‘పోలీస్ స్టేషన్ ఏమైనా నీ అయ్య జాగీరా?’ అని ఎస్ఐను ప్రశ్నించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలోనే ఎస్ఐ తాజా పోస్ట్ వైరలవుతోంది.