News March 24, 2024
విశాఖ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయ కళాశాల జంక్షన్ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో మధురవాడ ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ కొండల జస్వంత్ (22) మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండండి: జీవీఎంసీ కమిషనర్

తుఫాను కారణంగా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. సహాయక చర్యల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ (0891-2507225), టోల్ ఫ్రీ నంబర్ (1800-425-0009) ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు, కొండవాలు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, తప్పుడు సమాచారం నమ్మవద్దని సూచించారు.
News October 25, 2025
నగరంలో క్రైమ్ రేట్ తగ్గించాలి: సీపీ శంఖబ్రత బాగ్చి

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఈనెల రివ్యూ మీటింగ్‌లో పోలీసు అధికారుల పనితీరుపై సమీక్షించారు. నగరంలో గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించాలని, రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, క్రైమ్ రేటు తగ్గించేలా రాత్రి నిఘా పటిష్ఠం చేయాలని సూచించారు. మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 25, 2025
విశాఖ: డెలివరీ బ్యాగ్‌లో గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్

డెలివరీ బ్యాగులను అడ్డుగా పెట్టుకుని గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పీఎంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. కోమ్మాది ప్రాంతంలో నిర్వహించిన దాడిలో నల్లబిల్లి గణేశ్ (32), సంజయ్‌కుమార్ (29)ని పట్టుకున్నారు. వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ప్రజలను కోరారు.


