News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News July 6, 2025
రేపు భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
News July 6, 2025
HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.
News July 6, 2025
సూళ్లూరుపేట: ఐటీయూ డైరెక్టర్ పదవికి నామినేషన్

ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డు డైరెక్టర్‌గా భారత అభ్యర్థిగా సూళ్లూరుపేటకు చెందిన రేవతి మన్నెపల్లిని కేంద్రం నామినేట్ చేసింది. ఇస్రో, బార్క్ వంటి సంస్థల్లో సేవలందించిన ఆమె ప్రస్తుతం జెనీవాలో సభ్యురాలిగా ఉన్నారు. రేవతి JNTUHలో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం ఇస్రోకు చెందిన షార్ కేంద్రంలో ఇంజినీర్‌గా పనిచేశారు. ASLV, PSLV రాకెట్ ప్రయోగాల్లో భాగస్వామ్యం అయ్యారు.