News March 17, 2025

జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్‌ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.

Similar News

News September 15, 2025

KNR: ఒకే వేదికపై కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, MP

image

MNCL రైల్వే స్టేషన్‌లో <<17713840>>వందే భారత్ రైలు<<>>కు అదనపు స్టాప్‌‌ను కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, MP వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు కీలక నేతలు వేదికపై నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఎప్పుడు ఉప్పునిప్పుల్లా ఉండే ఇరుపార్టీల నాయకులు ప్రొటోకాల్ సమయంలో మాత్రం ఇలా హుందాగా వ్యవహరించడం మంచి పరిణామమని అంటున్నారు. మీ COMMENT.

News September 15, 2025

పులిపిర్లకు ఇలా చెక్ పెట్టేద్దాం

image

వివిధ ఆరోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్‌సైడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లపై అద్దుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. • కలబందను పులిపిర్లపై రాస్తే కొద్దిరోజుల్లోనే రాలిపోతాయి. • ఆముదంలో బేకింగ్ పౌడర్ కలిపి, దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. ఇలా మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా పోతాయి.

News September 15, 2025

చీనీ, నిమ్మలో తెగుళ్లు.. నివారణ

image

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు(ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.