News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News January 7, 2026
టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు లాస్ట్ ఛాన్స్

TG: టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ చివరి అవకాశం కల్పించింది. తత్కాల్ విధానంలో ₹వెయ్యి లేట్ ఫీజుతో ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పింది. ఆయా తేదీల్లో స్కూల్ HMలకు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. హెడ్మాస్టర్లు 28వ తేదీ లోపు చలానా రూపంలో కట్టాలని, 29వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలంది. ఇదే చివరి అవకాశం అని, మరోసారి గడువు పొడిగించబోమని వివరించింది.
News January 7, 2026
నేడు ఖమ్మానికి కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, నాయకులను సమాయత్తం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది. ఉదయం 10:30కు ఖమ్మం చేరుకుని రాపర్తినగర్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు కార్యకర్తలు, నాయకుల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సర్పంచ్‌లకు సన్మానం, కార్యకర్తల సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
News January 7, 2026
శని ప్రభావంతో వివాహం ఆలస్యం

జాతక చక్రంలో వివాహ స్థానంపై శని ప్రభావం ఉంటే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. శని మందగమన గ్రహం కావడంతో ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది. దీనికి పరిష్కారంగా ప్రతి శనివారం శివాలయంలో నల్ల నువ్వులతో దీపారాధన చేయాలి. ‘శని గవచం’ పఠించడం, పేదలకు ఆహారం లేదా వస్త్ర దానం చేయడం వల్ల శని ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగి, వివాహ మార్గం సుగమం అవుతుంది.


