News March 17, 2025
అందుకే తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు: రేవంత్ రెడ్డి

TG: పొట్టి శ్రీరాములు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత విముక్తికి పోరాడిన గొప్ప వ్యక్తుల పేర్లను యూనివర్సిటీలకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు వర్సిటీలకు పేర్లు మార్చినట్లు గుర్తు చేశారు. ఆ కోవలోనే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని నిర్ణయించామన్నారు.
Similar News
News March 18, 2025
హైడ్రా పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు: రంగనాథ్

TG: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతంలోనే ప్రకటన చేశామని, ఇప్పటికే హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇలా ఎవరైనా మోసపోతే తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం లేదా స్థానిక పోలీసులనూ ఆశ్రయించవచ్చన్నారు.
News March 18, 2025
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే వెళ్లారు.. చివరకు..!

బట్టతలపై జుట్టు వస్తుందనుకున్న 67 మంది మోసపోయారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఇద్దరు వ్యక్తులు జుట్టు చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. తాము అందించే నూనె వాడితే జుట్టు వస్తుందని చెప్పగా స్థానికులు నమ్మారు. చివరకు ఆ నూనె వాడిన 67 మంది ఇన్ఫెక్షన్లు వచ్చి ఆస్పత్రిలో చేరారు. దీంతో పోలీసులు శిబిరం నిర్వహించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎలాంటి నైపుణ్యం, అనుమతి లేకుండా వారు శిబిరం నిర్వహించినట్లు చెప్పారు.
News March 18, 2025
27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్స్ అందించాలని ఈవో శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.