News March 24, 2024

నిజామాబాద్: ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

జగిత్యాల మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డేకు చిట్టాపూర్ వెళ్లాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్లాడు. శివకుమార్‌కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News March 4, 2026

ఇందల్వాయి: విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్

image

ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో రామ్ చరణ్ (15) అనే 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్ స్వామి, డా.సైదా జైనబ్, ఫణి కుమార్, డా.జ్యోతి విచారణ జరిపి నివేదిక అందజేశారు.

News March 4, 2026

NZB: ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలి: కాంగ్రెస్

image

జిల్లా అధ్యక్షుడు, కార్పొరేషన్ DCC అధ్యక్షుల పదవులు రెండూ సమాన హోదా కలిగినవిగా పరిగణించాలని, ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలని అధిష్టానం సూచించినట్లు NZB కార్పొరేషన్ DCC అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ చెప్పారు. బుధవారం DCC కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 రోజుల పాటు కాంగ్రెస్ అధిష్టానం తమకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.

News March 4, 2026

NZB: ఇంటర్ పరీక్షలు.. 369 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. NZB జిల్లా వ్యాప్తంగా 16,899 మంది విద్యార్థులకు గాను 369 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO రవికుమార్ తెలిపారు. 14,488 మంది జనరల్ విద్యార్థుల్లో 303 మంది, 2,411 మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 66 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారన్నారు.