News March 17, 2025
JGTL: హాట్ టాపిక్‌గా KTR, తీన్మార్ మల్లన్న భేటీ..!

KTR, హరీశ్ రావు, తీన్మార్ మల్లన్న HYDలో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పుల్లా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బీఆర్ఎస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.
Similar News
News November 9, 2025
ప్రచారానికి వాళ్లు దూరమేనా!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారానికి దూరమైనట్లేనని సమాచారం. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా ఆయన వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆ బాధ్యతలను కేటీఆర్ భుజాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు. అటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అన్నామలై, పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వస్తారని పేర్కొన్నా ఇప్పటి వరకు వారి జాడే లేదు.
News November 9, 2025
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు చేయకండి

మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం. అయితే కొన్ని పొరపాట్లు ఆ శక్తిని ప్రతికూలంగా మారుస్తాయట. ‘మనీ ప్లాంట్ ఎండిపోకూడదు. ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ ఉండాలి. లేకపోతే ధన నష్టానికి అవకాశముంది. ఈ ప్లాంట్‌ను ఇంటి లోపల పెంచడం ఉత్తమం. ప్రధాన ద్వారం బయట, మెయిన్ డోర్‌కు ఎదురుగా ఉంచకూడదు. ఈ నియమాలతో డబ్బు ప్రవాహం పెరుగుతుంది’ అని నిపుణులు సూచిస్తున్నారు.
News November 9, 2025
తంబళ్లపల్లి: ‘టమాటా రైతులను ఆదుకోండి’

టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తంబళ్లపల్లి (M)లో టమాటాను పండించిన రైతులు తుఫాన్ ప్రభావంతో గిట్టుబాటు ధరల్లేక రోడ్లపై పడేస్తున్నామంటున్నారు. గుండ్లపల్లి, గోపిదిన్నె, కన్నెమడుగు, కొటాల తదితర పంచాయతీల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పంటలు వేశామన్నారు. ఎకరాకు రూ.2 లక్షలు వరకు ఖర్చును ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.


