News March 24, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి నోటీసులు

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌తో పాటు ఓ ఛానల్ ఎండీకి నోటీసులు ఇచ్చారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు అయిన తర్వాత వీరు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News September 15, 2025
మరోసారి ప్రతీకారం తీర్చుకున్నాం: నెటిజన్స్

ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తు చేసింది. మొదట పాక్‌తో మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్ చేశారు. కానీ పోరు నుంచి తప్పుకోవడం కంటే పోరాడి మట్టి కరిపించడం మేలని అభిప్రాయపడిన వాళ్లూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా OP సిందూర్‌తో ఒకసారి, మైదానంలో ఇవాళ మరోసారి పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేదిక ఏదైనా దాయాదికి బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు.
News September 15, 2025
BREAKING: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ASIA CUP-2025: పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది.
News September 15, 2025
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో తొలి వారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఆమెను ఎలిమినేట్ చేసినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న నటి ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి సేఫ్ జోన్‌లోకి చేరుకున్నారు. వీళ్లు హౌస్‌లోనే కొనసాగనున్నారు. కొరియోగ్రాఫర్ అయినా శ్రష్ఠి ఈ సీజన్‌లో సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి వెళ్లారు.