News March 17, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: ‘ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించాలి’ 

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఉపాధి హామీ పథకం కూలీలకు 10 వారాల బకాయిలు చెల్లించాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు విన్నవించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు.

Similar News

News September 14, 2025

దాయాదితో నేడే పోరు.. ఆసక్తి కరవు!

image

భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం మొత్తం అలర్ట్ అవుతుంది. టోర్నీ, వెన్యూ, ఫార్మాట్‌తో సంబంధంలేకుండా మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. ఆసియా కప్‌లో ఇవాళ టీమ్ ఇండియా-పాక్ తలపడుతున్నా ఎక్కడా ఆ ఉత్కంఠ లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంతా మారిపోయింది. దాయాది దేశంతో క్రికెట్ వద్దని అంతా వారిస్తున్నారు. బాయ్‌కాట్ ట్రెండ్ కూడా నడుస్తోంది. మరి మీరు ఇవాళ మ్యాచ్ చూస్తారా? COMMENT.

News September 14, 2025

ప్రకాశం కొత్త కలెక్టర్ ముందు సవాళ్లు ఇవేనా..!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత కలెక్టర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేసిన ప్రభుత్వం, జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంలో రాజాబాబును ప్రభుత్వం గుర్తించి మరీ భాద్యతలు అప్పగించింది. అయితే నూతన కలెక్టర్ ముందు తొలుత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, వెలుగొండ పూర్తి, భూ సమస్యలు సవాళ్లుగా నిలవనున్నాయి.

News September 14, 2025

రూ.81 వేల వరకు జీతం.. ఇవాళే లాస్ట్!

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ చేసినవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100(అలవెన్సులు అదనం) వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్‌సైటును సంప్రదించగలరు.