News March 17, 2025
సిరిసిల్ల: ప్రజావాణిలో 113 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను SRCL కలెక్టర్, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో 113 దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు.
Similar News
News July 9, 2025
మెగా పేరెంట్స్ డే ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్

ఏలూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రైవేట్, ప్రభుత్వ, జూనియర్ కళాశాల యజమానులు, విద్యాశాఖ అధికారులతో మెగా పేరెంట్స్ డే నిర్వహణపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం కలెక్టర్ సమీక్షించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు క్రమ పద్దతిలో, మధ్యాహ్న భోజనం అందరికీ అందేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థి తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం, తల్లికి వందనం లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు.
News July 9, 2025
బాపట్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

బాపట్ల మండలం కప్పలవారిపాలెం గ్రామం సమీపంలోని నాగరాజు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభించింది. బాపట్ల రూరల్ పోలీసులు కథనం మేరకు.. కప్పల వారి పాలెం గ్రామంలోని నాగరాజు కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News July 9, 2025
కర్నూలు మాజీ ఎంపీకి గోల్డ్ మెడల్

కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.