News March 17, 2025

వికారాబాద్‌లో NCCని ఏర్పాటు చేయండి: ఎంపీ

image

వికారాబాద్‌లో NCC యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్‌కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు NCC యూనిట్‌ను వికారాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News November 7, 2025

నరసాపురం వరకు వందేభారత్ రైలు

image

AP: చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.20PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.

News November 7, 2025

హిందువులు సత్తా చాటాలి: MP డీకే అరుణ

image

2 లక్షలకు పైగా ఉన్న హిందువులంతా ఏకమై జూబ్లీహిల్స్ ఊప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బోడబండలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.

News November 7, 2025

ధర్మం కోసం బతకండి..

image

వివిధ సందర్భాల్లో పుట్టపర్తి సత్యసాయి బాబా చెప్పిన సూక్తులు..
★ ఆహారాన్ని భగవంతుడి కానుకగా భావించి, తినేముందు భగవంతుడికి సమర్పించండి
★ నామస్మరణ చేయండి, మీ నాలుక మధురం అవుతుంది, మీకు మంచి కలుగుతుంది
★ కేవలం అన్నం కోసం కాక, ధర్మం కోసం బతకండి
★ సూర్యునివలే ప్రతి మానవుడు నిరహంకారిగా తయారుకావాలి.