News March 17, 2025
BHPL: ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. పరిష్కరించబడిన ఫిర్యాదులపై వచ్చేవారం సమగ్ర నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.
Similar News
News January 8, 2026
వరంగల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనుమానమే?

వరంగల్ కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తయ్యింది. రెండు అంతస్తుల్లో 4 బ్లాక్‌ల వారీగా నిర్మాణాన్ని గౌరి శంకర్ ఇన్ ఫ్రా కంపెనీ రూ.61 కోట్లతో పూర్తి చేసింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేశారు. రూ.87 లక్షల వ్యయంతో కలెక్టర్ నివాసం, అడిషనల్ కలెక్టర్, డీఆర్వో, 8 జిల్లా స్థాయి అధికారుల నివాస క్వార్టర్లు నిర్మించారు. ఈ నెల 19న సీఎం రేవంత్ జిల్లాకు వస్తున్నా ప్రారంభోత్సవం డౌటేగానే ఉన్నట్టు తెలుస్తోంది.
News January 8, 2026
ప్రణయ్ హత్య.. నిందితుడికి బెయిల్

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య(2018) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్(అమృత బాబాయ్)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ మధ్యంతర పిటిషన్ వేశారు. వాదనలు విన్న ధర్మాసనం అతని వయసు, జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చింది.
News January 8, 2026
మరో భారీ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న జమ్మలమడుగు

జమ్మలమడుగు.. ఇక్కడ రాజకీయ రణరంగమే కాదు, రాష్ట్ర, జాతీయ స్థాయి ఈవెంట్లను సైతం చేయగల సత్తా ఉన్న ప్రాంతం అని నిరూపిస్తోంది. ఈనెల 5 నుంచి ప్రారంభమైన 69వ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ పోటీలను సమర్థవంతంగా జమ్మలమడుగులోని అధికారులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ నెల 11 నుంచి 13 వరకు గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరిసారిగా 2020లో వైభంగా జరిగాయి. దీంతో అధికారులు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు.


