News March 17, 2025

రాయచోటి: మండలికి అధ్యక్షత వహించిన మైనార్టీ మహిళ

image

తొలిసారి డిప్యూటీ ఛైర్ పర్సన్ హోదాలో మైనార్టీ మహిళ జకియా ఖానం శాసనమండలికి అధ్యక్షత వహించారు. కాగా ఈమె అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వారు కావడం గమనార్హం. అధిపతి లేనప్పుడు ఈ అవకాశం దక్కుతుంది. మైనార్టీ మహిళ YCP తరపున ఎమ్మెల్సీగా ఎంపికవ్వడం, డిప్యూటీ ఛైర్ పర్సన్ హోదాలో కూర్చోవడం మరో అరుదైన అవకాశం.

Similar News

News March 18, 2025

ఎర్రగుంట్లలో ప్రమాదం.. సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం

image

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఇవాళ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం చెందారు. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2025

నెల్లూరు యువకుడిపై బీరు బాటిళ్లతో దాడి

image

నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు సమీపంలో ఓ యువకుడిపై ఇద్దరు యువకులు విచక్షణారహితంగా బీరు బాటిళ్లతో దాడి చేశారు. డైకస్ రోడ్డులో వెళ్తున్న వెంగళరావు నగర్‌కు చెందిన షారుక్‌ను ఆటోలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులు అడ్డగించి పలకరించలేదని దౌర్జన్యంతో బీరు బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన షారుక్‌ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 18, 2025

రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!