News March 17, 2025
ములుగు: ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 19 ఫిర్యాదులు సమర్పించారని ఆయన తెలిపారు. భూసమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగ ఉపాధి, ఆసరా పెన్షన్లు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించామన్నారు.
Similar News
News September 17, 2025
నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసా?

మహిళా సాధికారత కోసం కేంద్రం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే <
News September 17, 2025
ADB: గండర గండడు కొమురం భీముడే మన బిడ్డ..!

తెలంగాణ చరిత్రలో వీరత్వానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచారు కొమురం భీమ్. 1901లో జన్మించిన ఈ గిరిజన యోధుడు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు. ‘జల్, జంగల్, జమీన్’ అనే నినాదంతో గిరిజనులను ఏకం చేసి తమ వనరులపై ఉన్న హక్కులను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 1940లో జోడేఘాట్ వద్ద నిజాం పోలీసులతో జరిగిన పోరాటంలో కొమురం భీమ్ అమరుడయ్యారు. ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శం.
News September 17, 2025
పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్సన్!

ఆసియా కప్: షేక్‌హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్‌ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్‌కు రిఫరీగా రిచర్డ్సన్ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.