News March 17, 2025

జగిత్యాల: ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన 35 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వాటిని ఆలస్యం చేయకుండ పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవోలు మధు సుధన్, జీవాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 17, 2026

బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

image

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్‌కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

News January 17, 2026

జగిత్యాల: ‘ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం’

image

జగిత్యాల జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయికల్, జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత పాల్గొన్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో BRS జెండా ఎగరడం ఖాయమని కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్ అన్నారు.

News January 17, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం
✒MBNR: CM ఇలాకా.. BRSలో భారీగా చేరికలు
✒పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ
✒వనపర్తి:భార్య చేతిలో భర్త దారుణ హత్య
✒రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం
✒సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన.. జర్నలిస్టులు ముందస్తు అరెస్ట్
✒పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:CM రేవంత్ రెడ్డి