News March 17, 2025

200 ఏళ్లనాటి పనస చెట్టును చూశారా?

image

TNలోని కడలూరులో పన్రుటి ప్రాంతం పనస పెంపకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 4వేల మందికిపైగా రైతులు 800 హెక్టార్లలో వీటిని పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 200 ఏళ్లనాటి పనస వృక్షం ఫొటోను ఓ ఫారెస్ట్ అధికారి షేర్ చేస్తూ ఇది ఏటా 200 పండ్లు అందిస్తోందని తెలిపారు. కాగా, ఫైబర్, ఖనిజాలతో కూడిన పోషకాహారాలు పనస పండులో మెండుగా ఉండటంతో వీటి పెంపకానికి తమిళనాడు ప్రభుత్వం ‘జాక్‌ఫ్రూట్ మిషన్’ను ప్రారంభించింది.

Similar News

News March 18, 2025

పెద్ద దేవళాపురం@42.7 డిగ్రీలు

image

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉలిందకొండలో 42.6, ఖాజీపేటలో 41.8, దరిమడుగులో 41.5, నాగసముద్రం, వత్తలూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే నమోదవడం గమనార్హం. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 42 మండలాల్లో వడగాలులు వీచాయని APSDMA వెల్లడించింది.

News March 18, 2025

వ్యోమగాముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

image

వ్యోమగాములు అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు టీమ్‌లో ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. అతనికి ప్రాథమిక చికిత్స, ఇంజెక్షన్లు ఇవ్వడం, గాయాలకు కుట్లు వేయడంపై శిక్షణ ఇస్తారు. ISSలోనే మెడికల్ కిట్ ఉంటుంది. అలాగే అక్కడి టాయిలెట్స్ కూడా భిన్నంగా ఉంటాయి. అందులో వాటర్ గన్‌కు బదులు వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది. వ్యర్థాలు గాల్లో తేలియాడకుండా ఇది పీల్చుకుంటుంది. గొట్టంలాంటి వాక్యూమ్‌‌ను టాయిలెట్‌కు వాడతారు.

News March 18, 2025

చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: సీఎం

image

AP: చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీంతో 93వేల మంది చేనేతకారులకు, 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి ₹50,000 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే వారికి GST రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నేతన్నలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!