News March 17, 2025
మద్ది అంజన్నను దర్శించుకున్న సినీ హీరో నితిన్

జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని సినీ హీరో నితిన్, మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్, దర్శకుడు వెంకి కుడుముల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం హీరో నితిన్‌కు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ముఖ మండపం వద్ద వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.
Similar News
News January 14, 2026
ఆధునిక యంత్రాలు వాడి అధిక ఆదాయం

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేశారు. డెయిరీ ఫామ్‌ను విస్తరించి ఈ ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
News January 14, 2026
సంక్రాంతి పంచే సందేశాలు

మకర సంక్రాంతిలో ‘మకరం’ అంటే మొసలి. సుఖాలకు అలవాటుపడి మార్పును నిరోధించే మనిషి మొసలి పట్టులో చిక్కుకున్న వాడితో సమానం. జీవితంలో కదలిక లేకపోతే ఆందోళనలు, అనారోగ్యాలు తప్పవని, మార్పును ఆహ్వానించడమే ఉత్సవమని ఈ పండుగ బోధిస్తుంది. అందుకే సంక్రాంతి వేళ స్నానాదులు, శివాభిషేకంతో మనసును శుద్ధి చేసుకోవాలి. మనసులో నిరంతరం సానుకూల కదలిక ఉండాలని, శత్రుత్వాలు వీడి కలిసి మెలిసి ఉండాలనేదే ఈ పండుగ ఇచ్చే సందేశం.
News January 14, 2026
స్విమ్మింగ్ ఫూల్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈత కొలను(స్విమ్మింగ్ పూల్) మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో క్రీడా సదుపాయాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. మరమ్మతులు ముగించి, నైపుణ్యం గల సిబ్బందిని నియమించాలని సూచించారు. ఈత కొలనును ఏడాది పొడవునా వినియోగంలో ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.


