News March 17, 2025
SC వర్గీకరణ.. మిశ్రా కమిషన్ నివేదికకు క్యాబినెట్ ఆమోదం

AP: SC వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై TDLPలో ఎస్సీ ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. జిల్లాను ఒక యూనిట్‌గా వర్గీకరణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు కుదరకపోతే ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలన్నారు. సరైన డేటా లేనందున 2011 జనాభా ప్రాతిపదికన వర్గీకరణకు MLAలు అంగీకారం తెలిపారు.
Similar News
News March 18, 2025
తెలంగాణ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు

అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరమని, వాటిని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించినా అది వాణిజ్య దోపిడీ కిందికే వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అంగీకారం లేకుండా మహిళల ఫొటోలు ప్రకటనల్లో వాడుతున్నారనే నమ్రత అంకుశ్ అనే మహిళ పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 24లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, తెలంగాణ, MH, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఇతరులకు ఆదేశాలిచ్చింది.
News March 18, 2025
భగవద్గీత నాకు బలాన్ని, శాంతిని ఇస్తుంది: తులసీ గబ్బార్డ్

భగవద్గీత తనకు ప్రశాంతతను, మనోస్థైర్యాన్ని ఇస్తుంటుందని అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANIతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘భారత్‌కు వస్తే సొంత ఇంటికి వచ్చినట్లుంటుంది. ప్రజలు ఎంతో సాదరంగా మాట్లాడుతారు. ఆహారం అత్యంత రుచికరంగా ఉంటుంది. నేను యుద్ధక్షేత్రంలో ఉన్న సమయంలో భగవద్గీత నాకు ఊరటనిచ్చేది’ అని వివరించారు. ఆమె హిందూమతాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.
News March 18, 2025
తెలంగాణ తదుపరి CSగా రామకృష్ణారావు?

TG: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పదవీకాలం ఈ ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా కె.రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1980 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 12 బడ్జెట్లను రూపొందించి రికార్డు సృష్టించారు.