News March 17, 2025
RMP వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం?

RMP వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. బండి ఆత్మకూరు(M) కడమల కాల్వకు చెందిన ఓ మహిళను RMP లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదే విషయమై ఫిబ్రవరిలో బండి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కేసు వాపస్ తీసుకోవాలంటూ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి RMP వేధించడంతో మహిళ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని బంధువులు తెలిపారు.
Similar News
News October 15, 2025
UN HRC మెంబర్స్‌గా ఇండియా, పాకిస్థాన్

ఐక్యరాజ్య సమితి 2026-28కి గాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ను ఎన్నుకుంది. మెంబర్స్‌గా అంగోలా, చిలీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్టోనియా, ఇండియా, ఇరాక్, ఇటలీ, మారిషస్, పాక్, స్లోవేనియా, SA, UK, వియత్నాంను ఎన్నుకుంది. నిత్యం మానవ హక్కులను కాలరాసే పాక్‌లాంటి దేశానికి UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 15, 2025
ఈ నెల 16న నిర్మల్‌లో జాబ్ మేళా

ఈ నెల 16న నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి గోవింద్ తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో ఖాళీలు ఉన్నాయన్నారు. దాదాపు 68 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 15, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.