News March 17, 2025
10వ తరగతి పరీక్షలు నిర్వహణకు 21 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఈనెల 21 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరీక్షలు నిర్వహణకు 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 3449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 18, 2025
MNCL: బంగారం చోరీ.. ఇద్దరి అరెస్ట్: ACP

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి ప్యాగ పోషంను కత్తితో చంపుతామని బెదిరించి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ జుబీర్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ సోమవారం తెలిపారు. సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, కత్తి, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
News March 18, 2025
బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.
News March 18, 2025
కరీంనగర్: బాలికలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి

తిమ్మాపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో పాటు భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఏ సమయానికి ఏయే ఆహారం ఇస్తున్నారని విద్యార్థులను అడిగారు.