News March 17, 2025

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 10, 2025

స్లీపింగ్ మాస్క్‌లు వాడుతున్నారా?

image

స్కిన్‌కేర్‌లో భాగంగా చాలామంది స్లీపింగ్ మాస్క్‌లు వాడటం ఎక్కువైంది. అయితే వీటిని ఎక్కువగా వాడటం నష్టమే అంటున్నారు నిపుణులు. ఈ మాస్కులు లైట్ క్రీమ్, జెల్‌తో ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ వీటిని రోజూ వాడటం వల్ల చర్మం ఎక్కువ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. సహజ తేమను కోల్పోయి, మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వారానికి 2సార్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News November 10, 2025

శ్రీశైలంలో ఈనెల 14న కోటి దీపోత్సవం

image

AP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తొలిసారిగా ఈ నెల 14న కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉచితంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీపోత్సవానికి అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే అందజేస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు పరిపాలన భవనంలోని శ్రీశైల ప్రభ కార్యాలయంలో 12వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 10, 2025

AAIలో అప్రెంటిస్ పోస్టులు

image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) 20గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ (B.COM, BA, BSc, BBA), డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.12వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు NATS పోర్టల్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.aai.aero