News March 17, 2025

నంద్యాల కలెక్టరేట్‌కు 209 అర్జీల రాక

image

నంద్యాల కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా నలుమూలాల నుంచి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. మొత్తంగా 209 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పరిష్కరించిన 27,854 ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. 

Similar News

News December 25, 2025

నా వీర్యంతో పిల్లలను కంటే ఖర్చునాదే: దురోవ్

image

టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. 37ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న వాళ్లు తన వీర్యం ద్వారా IVFతో పిల్లలను కంటే ఖర్చులు భరిస్తానని ప్రకటించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. స్పెర్మ్ డొనేషన్ ద్వారా ఆయన ఇప్పటికే వంద మందికిపైగా పిల్లలకు తండ్రిగా ఉన్నారు. ఈ నిర్ణయంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అలాగే ఆయన తన ఆస్తి మొత్తాన్ని తన పిల్లలకు సమానంగా పంచుతానని గతంలోనే ప్రకటించారు.

News December 25, 2025

GNT: నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే..!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం షెడ్యూల్‌ను ఆయన వ్యక్తిగత కార్యదర్శి విడుదల చేశారు. ఉదయం 10.55 గంటలకు వెంకటపాలెం వెళ్తారు. 11 గంటలకు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతారు. తిరిగి మధ్యాహ్నం 1.10 గంటలకు నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు వెంకటపాలెంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 25, 2025

సూర్యాపేట: ”ఆయన”ను పక్కకు పెడితే బెటర్

image

గ్రామాల్లో మహిళా సర్పంచుల పరిపాలన వ్యవహారాలు భర్తలే చూసుకున్న ఘటనలు గతంలో చూశాం. మహిళా ప్రతినిధులను కేవలం సంతకాలకే పరిమితం చేస్తూ, పురుషాధిపత్యం కొనసాగితే రిజర్వేషన్ల ఆశయం నీరుగారుతుందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, లేనిపక్షంలో అది “పెత్తనం ఆయనదే” అన్న చందంగా మారుతుందని వాదిస్తున్నారు.