News March 17, 2025
పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్మీట్లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.
Similar News
News December 31, 2025
APPLY NOW: CDFDలో ఉద్యోగాలు

HYDలోని BRIC-సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD)లో 2సైంటిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 18వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 27వరకు పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి MSc, MTech, ఎండీ, MVSc, M.Pham, M.Biotech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cdfd.org.in/
News December 31, 2025
శివలింగం ధ్వంసం చేసింది హిందువే: SP

AP: ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఈ పని చేసింది తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆలయ సిబ్బందితో అతనికి డ్రైనేజీ విషయంలో గొడవలయ్యాయి. వారిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశాడు. నిందితుడు క్రిస్టియన్ కాదు హిందువే. అతని ఒంటిపై టాటూలు కూడా ఉన్నాయి. అతను వాడిన వస్తువులు, స్కూటీ, దుస్తులు సీజ్ చేశాం’ అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.
News December 31, 2025
రాజస్థాన్‌లో 150KGల అమ్మోనియం నైట్రేట్ సీజ్.. ఇద్దరు అరెస్ట్

న్యూఇయర్ సంబరాలకు రెడీ అవుతున్న వేళ రాజస్థాన్‌లో భారీగా అమ్మోనియం నైట్రేట్, పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. డిస్ట్రిక్ట్ స్పెషల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో యూరియా మాటున తరలిస్తున్న 150KGల అమ్మోనియం నైట్రేట్‌ను గుర్తించి సీజ్ చేశారు. 200 ఎక్స్‌ప్లోజివ్ బ్యాటరీలు, 1100 మీటర్ల వైర్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని DSP తెలిపారు.


