News March 17, 2025
సిరిసిల్ల: బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే: ఎస్పీ

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్లజిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల 18 ఫిర్యాదులను స్వీకరించారు.
Similar News
News November 4, 2025
ఏటూరునాగారం: ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ మేళా

ఏటూరునాగారం ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదుకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు అప్రెంటిస్ మేళాలో హాజరవుతారన్నారు. వివిధ ట్రేడ్లలో అనుభవం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 10న ఐటీఐ కళాశాలలో హాజరుకావాలని కోరారు.
News November 4, 2025
అల్లూరి జిల్లాలో కూరగాయలు ధరలకు రెక్కలు

అల్లూరి జిల్లాలో కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగాయి. పాడేరులో గత వారం చిక్కుడు కాయలు కిలో రూ.100ఉండగా నేడు 160కి వీరిగిపోయింది. అల్లం కిలో రూ.60 ఉండగా నేడు రూ.120కి పెరిగిందని వినియోగదారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో సాగు చేస్తున్న కూరగాయలు తోటలు వర్షాలకు దెబ్బ తినడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
News November 4, 2025
నర్సంపేట: పెన్సిల్ మొనపై కార్తీక దీపం..!

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని, పెన్సిల్ (లెడ్) మొనపై దీపపు ప్రమిదను చెక్కి, అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించాడు. జయకుమార్ కనబరిచిన ఈ సూక్ష్మ ప్రతిభ పట్ల డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


