News March 17, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19కు వాయిదా వేసింది.
Similar News
News March 18, 2025
డీలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశం

TG: లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షతన నియోజక వర్గాల పునర్విభజనపై అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వివిధ పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అఖిలపక్ష సమావేశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు.
News March 18, 2025
విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్లో మెగాస్టార్..?

చిరంజీవి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే మూవీపై ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇందులో హీరోయిన్గా అదితిరావు హైదరీని ఎంచుకున్నట్లు టాక్. గతంలోనూ మెగాస్టార్ విలేజ్ బ్యాక్ డ్రాప్తో నటించిన చిత్రాలు విజయం సాధించడంతో పాటు..అనిల్ రావిపూడి కాంబో కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి.
News March 18, 2025
బీసీ రిజర్వేషన్లకు BRS వ్యతిరేకం : మంత్రి సీతక్క

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు BRS మెుదటి నుంచి వ్యతిరేకంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. ఉదయం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటించి సాయంత్రం మాట మారుస్తోందని మండిపడ్డారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మైనార్టీ,ST రిజర్వేషన్లు పెంచలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆలోచనతో న్యాయనిపుణుల సలహాలతోనే కులగణన చేశామని తెలిపారు.