News March 17, 2025
సిరిసిల్ల: మహిళలను అభినందించిన కలెక్టర్

ఈనెల 20వ తేదీ నుంచి ఢిల్లీలో జరుగుతున్న కే లో ఇండియా పారా గేమ్స్‌కు ఎంపికైన మిట్టపల్లి అర్చన, భూక్య సక్కుబాయిలను కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఇటువంటి మైలురాయిలు మరెన్నో చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రాందాస్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
HYD: సీఎంను కలిసిన బీసీ సంఘాల నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
News March 18, 2025
తల్లి, సోదరుడి శవాలతో నెల రోజులుగా ఇంట్లోనే..

AP: తల్లి, సోదరుడి మృతదేహాలతో ఓ వ్యక్తి నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కడప శాటిలైట్ సిటీలో నివాసముంటున్న వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు(45,55 ఏళ్లు) ఉన్నారు. నెల కిందట ఆమె చనిపోగా, ఓ కొడుకు ఉరేసుకున్నాడు. ఈ ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు. దీంతో ఆ ఇంటి నుంచి దుర్వాసన వచ్చే దాకా విషయం బయటకు రాలేదు. స్థానికులు మానసిక స్థితి లేని మరో కుమారుడిని ఆశ్రమానికి తరలించారు.
News March 18, 2025
వనపర్తి: విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం

వనపర్తి జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకాలంలో ఏకరూప దుస్తులు అందించే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఉచిత ఏకరూప దుస్తుల విషయంలో మంగళవారం కలెక్టరేట్‌లో విద్యా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు.