News March 17, 2025

కృష్ణా: జిల్లాలో పదో తరగతి పరీక్షకు 286 మంది గైర్హాజరు

image

పదవ తరగతి పరీక్షలు కృష్ణాజిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని డీఈఓ రామారావు తెలిపారు. తొలి రోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 21,162 మంది విద్యార్థులకు 20,876 మంది హాజరయ్యారన్నారు. 286 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 4, DLO అధికారులు 2, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ 2 కేంద్రాలను పరిశీలించారన్నారు.

Similar News

News March 18, 2025

తోట్లవల్లూరు: కోడి పందేల శిబిరంపై పోలీసుల దాడులు 

image

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు, దేవరపల్లిలోని కోడి పందేల శిబిరంపై తోట్లవల్లూరు పోలీసుల సోమవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 21 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.9 వేల నగదు, 3 కోడి పుంజులు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పమిడి ముక్కల సర్కిల్ పరిధిలో జూద క్రీడల్లో పాల్గొన్నా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చిట్టిబాబు హెచ్చరించారు.

News March 18, 2025

కృష్ణా: పెండింగ్ పనులు పూర్తి చేయాలి- కలెక్టర్

image

మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఐసీడీఎస్, సీపీఓ, గనులు, జిల్లా పంచాయతీ తదితర శాఖల అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, ఎంపీ లాడ్స్, జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్, జడ్పీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల భవనాల మరమ్మతులకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

News March 17, 2025

కృష్ణా: ప్రజా సమస్యలు పరిష్కరించండి- ఎస్పీ 

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ గంగాధర రావు పాల్గొని 44 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.

error: Content is protected !!