News March 17, 2025
కథలాపూర్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో కాసారపు రాజగంగు (50) అనే మహిళ ఉరేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. భర్తతో పాటు కుమారుడు ఏమి పని చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు తలెత్తాయన్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ఆవేదనతో సోమవారం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News March 18, 2025
అనకాపల్లి: తొలి రోజు 195 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షకు 195 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 107 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 21,162 మంది విద్యార్థులకు 20,967 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. ఏడు స్క్వాడ్ బృందాలు 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయని అన్నారు.
News March 18, 2025
22న పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 22న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం రావడం జరుగుతుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
News March 18, 2025
తోట్లవల్లూరు: కోడి పందేల శిబిరంపై పోలీసుల దాడులు

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు, దేవరపల్లిలోని కోడి పందేల శిబిరంపై తోట్లవల్లూరు పోలీసుల సోమవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 21 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.9 వేల నగదు, 3 కోడి పుంజులు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పమిడి ముక్కల సర్కిల్ పరిధిలో జూద క్రీడల్లో పాల్గొన్నా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చిట్టిబాబు హెచ్చరించారు.