News March 17, 2025
MBNR: ప్రజావాణికి 130 ఫిర్యాదులు

ప్రజావాణికి 130 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
News March 18, 2025
MBNR: 16 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 16 గ్రామాలను ఎంపిక చేశామని అక్కడ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో నివేదిక పంపించాలని ఆమె ఆదేశించారు.
News March 18, 2025
MBNR: తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టండి: కలెక్టర్

వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఛాంబర్‌లో తాగునీరు, విద్యుత్ సమస్యపై సమీక్షించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.