News March 17, 2025

నల్గొండ: 35 మంది అర్జీదారులతో మాట్లాడిన ఎస్పీ 

image

పోలీసు గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈరోజు పరిశీలించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

Similar News

News March 18, 2025

GOVT జాబ్ కొట్టిన నల్గొండ అమ్మాయి 

image

టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1,2 ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం వస్త్రాంతండా పరిధిలోని నడిపి తండాకు చెందిన మేఘావత్ కవిత రాష్ట్ర స్థాయిలో 329 ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలంగా ఎటువంటి కోచింగ్ లేకుండా స్వతహాగా ప్రిపేరై ఉద్యోగం సాధించిన కవిత ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఇబ్రహీంపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు.

News March 18, 2025

నల్గొండ: మరో GOVT జాబ్ కొట్టిన టీచర్

image

నల్లగొండ రూరల్ మండలం ST కాలనీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న G.మౌనిక ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2 ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్‌గా సెలెక్ట్ అయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, తోటి ఉపాధ్యాయులు ఉద్యోగం అభినందించారు. ఓవైపు టీచర్ జాబ్ చేసుకుంటూ పట్టుదలతో చదివి హాస్టల్ వెల్ఫేర్‌గా సెలెక్ట్ అయ్యారని కొనియాడారు. 

News March 18, 2025

GOVT జాబ్ కొట్టిన నల్గొండ జిల్లా బిడ్డ

image

టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పొనుగోటి మాధవరావు కుమారుడు హరీశ్ సత్తా చాటారు. 300 మార్కులకు గాను 199.16 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 121, జోన్ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించి వార్డెన్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హరీశ్‌కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

error: Content is protected !!