News March 17, 2025
సీతానగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సీతానగరం మండలం జగ్గు నాయుడుపేట సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం తాంబరం నుంచి చక్రధరపూర్ వెళ్తున్న రైలు నుంచి ప్రధాన్ హం బోరో (23) జారి పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విజయనగరం తరలించామన్నారు.
Similar News
News March 18, 2025
రాజవొమ్మంగిలో యువతి ఆత్మహత్య

రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకి చెందిన ఆర్.సంజనా ప్రియ (19) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని సీఐ సన్యాసినాయుడు సోమవారం రాత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వంట చేయకుండా టీవీ చూస్తున్న యువతిని మందలించారు. అనంతరం యువతి క్షణికావేశంలో గడ్డిమందును తాగింది. కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందజేస్తుండగా మృతి చెందిందని సీఐ చెప్పారు.
News March 18, 2025
అనకాపల్లి: తొలి రోజు 195 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షకు 195 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 107 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 21,162 మంది విద్యార్థులకు 20,967 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. ఏడు స్క్వాడ్ బృందాలు 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయని అన్నారు.
News March 18, 2025
22న పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 22న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం రావడం జరుగుతుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.