News March 17, 2025

‘ట్రూత్ సోషల్’లో ప్రధాని మోదీ.. తొలి పోస్ట్ ఇదే

image

ట్రంప్ మీడియా&టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో భారత ప్రధాని మోదీ జాయిన్ అయ్యారు. ఈ వేదికపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. లెక్స్ ఫ్రైడ్‌మన్‌కు ఇచ్చిన తన ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసినందుకు US ప్రెసిడెంట్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ తన ప్రకటనలు ఎక్కువగా ‘ట్రూత్ సోషల్’లోనే చేస్తారన్న సంగతి తెలిసిందే.

Similar News

News November 8, 2025

ఇవాళ్టి బంగారం, వెండి ధరలిలా

image

రెండో శనివారం సందర్భంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020గా ఉంది. అటు వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గడం విశేషం. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,11,850గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ. 1,65,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 8, 2025

‘కృష్ణ పక్షం’ అంటే ఏంటి?

image

క్యాలెండర్‌లో కొన్ని తిథుల ముందుండే కృష్ణ పక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. కృష్ణ పక్షం అంటే.. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత, అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలం. ఈ పక్షంలో చంద్రుడి వెన్నెల క్రమంగా తగ్గుతుంది. చంద్రుడు అలా క్షీణిస్తూ పోతాడు కాబట్టి దీన్ని క్షీణ చంద్ర పక్షమని, చీకటి పక్షమని కూడా అంటారు. చీకటి, నలుపును సూచించే ‘కృష్ణ’ను జోడించి కృష్ణ పక్షం అనే పేరొచ్చింది. బహుళ పక్షం అని కూడా వ్యవహరిస్తారు.

News November 8, 2025

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో 64 ఉద్యోగాలు

image

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌ 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC,STలకు రూ.500. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in