News March 17, 2025

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల కానున్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని TTD వెల్లడించింది. ఈ టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18, 19, 20వ తేదీల్లో ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించింది. అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని సూచించింది.

Similar News

News March 18, 2025

ఒంటి పూట బడుల సమయం మార్పు

image

AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా.5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.

News March 18, 2025

శశాంక్ సింగ్ IPL ఆల్ టైమ్ ఎలెవన్.. కెప్టెన్ ఎవరంటే?

image

పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్ IPLలో తన ఆల్ టైమ్ ఎలెవన్‌ టీమ్‌ను ప్రకటించారు. గత 17 సీజన్లలో సత్తా చాటిన ప్లేయర్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. టీమ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకోగా విదేశీ ప్లేయర్ల కేటగిరీలో డివిలియర్స్, మలింగను ఎంపిక చేశారు.
జట్టు: సచిన్, రోహిత్ శర్మ(C), కోహ్లీ, సురేశ్ రైనా, డివిలియర్స్, ధోనీ, హార్దిక్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, బుమ్రా, మలింగ.
మీ టీమ్ కామెంట్?

News March 18, 2025

రన్యారావు కేసు.. తెలుగు నటుడు అరెస్ట్

image

కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్టు చేశారు. ‘పరిచయం’ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రన్యారావు వెనుక తరుణ్ కింగ్‌పిన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!