News March 17, 2025
నంద్యాల: పోలీసుల గ్రీవెన్స్ డేకు 72 అర్జీల రాక

నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. మొత్తం 72 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను విచారించి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా.. త్వరగా పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Similar News
News March 18, 2025
కుబీర్: కరెంట్ షాక్తో రైతు మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్(48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికి రాలేదని తన కుమారుడు వెళ్లి చూడగా కరెంట్ షాక్కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
News March 18, 2025
వనపర్తి: 103 ఏళ్ల వృద్ధుడు మృతి

మదనాపురం మండలం నరసింగాపురానికి చెందిన శతాధిక వృద్ధుడు మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన పెద్దఆశన్న(103) మొదటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా ఎన్నికై మూడు పర్యాయాలు కొనసాగారు. ఐదుసార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన కుటుంబానికి మాజీ సర్పంచ్ భాగమ్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News March 18, 2025
NGKL: చెరువులో పడి మహిళ మృతి

ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన ఘటన ఈ నెల 16న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. తెలకపల్లి మండలానికి చెందిన చంద్రమ్మ(35) కొంత కాలంగా మద్యానికి బానిసైంది. కుటుంబ సభ్యులు ఎంతచెప్పినా పట్టించుకోలేదు. గ్రామ శివారులో ఉన్న పెద్దచెరువు దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడింది. ఈత రాకపోవటంతో మృతిచెందింది. ఈ మేరకు కేసునమోదైంది.