News March 17, 2025

అనకాపల్లి జిల్లాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్పీ

image

అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా లారీ యజమానులు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులు కు సూచించారు.

Similar News

News March 18, 2025

భగవద్గీత నాకు బలాన్ని, శాంతిని ఇస్తుంది: తులసీ గబ్బార్డ్

image

భగవద్గీత తనకు ప్రశాంతతను, మనోస్థైర్యాన్ని ఇస్తుంటుందని అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANIతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘భారత్‌కు వస్తే సొంత ఇంటికి వచ్చినట్లుంటుంది. ప్రజలు ఎంతో సాదరంగా మాట్లాడుతారు. ఆహారం అత్యంత రుచికరంగా ఉంటుంది. నేను యుద్ధక్షేత్రంలో ఉన్న సమయంలో భగవద్గీత నాకు ఊరటనిచ్చేది’ అని వివరించారు. ఆమె హిందూమతాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.

News March 18, 2025

టెక్ సపోర్ట్ స్కామ్ పట్ల జాగ్రత్త: అన్నమయ్య SP

image

టెక్ సపోర్ట్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఒక ప్రకటన విధులు చేశారు. టెక్ సపోర్ట్ స్కామ్ అనేది ఒక రకమైన మోసం, ఇందులో మోసగాళ్లు ప్రముఖ టెక్ కంపెనీల (ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటివి) సాంకేతిక మద్దతు సిబ్బందిగా నటిస్తారన్నారు. వారు మీ కంప్యూటర్ లేదా ఇతర పరికరాలలో సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తామని మోసం చేస్తారన్నారు.

News March 18, 2025

Co-Living: హైదరాబాద్‌లో కొత్త కల్చర్!

image

HYDలో Co-Living కల్చర్ పెరుగుతోంది. ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు. IT కారిడార్, హైటెక్స్, మాదాపూర్, KPHB తదితర ప్రాంతాల్లో ఇటువంటి PG హాస్టల్స్‌ వెలిశాయి. పైగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ మరీ ఆకర్షిస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన యువత ఎక్కువగా హాస్టళ్లలోనే ఉంటారు. ఇందులో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే హాస్టళ్లలో ఉండేందుకు మొగ్గుచూపడం విశేషం.

error: Content is protected !!