News March 17, 2025
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

TG: ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ రాశారు. అఖిల పక్ష నేతలతో కలిసి ఆయనతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరేందుకు రేవంత్ పీఎంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
Similar News
News March 18, 2025
రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.
News March 18, 2025
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలు!

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సీజ్ఫైర్ ఒప్పందం నేటితో ముగిసింది. ఇరు వర్గాలూ పొడిగించకపోవడంతో యుద్ధం మళ్లీ మొదలైంది. హమాస్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ప్రారంభించగా పిల్లలు సహా 34మంది మరణించారు. పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయమిస్తున్న పాఠశాలపైనా అటాక్ చేసింది. అటు లెబనాన్, సిరియాల్లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 10 మంది చనిపోయారు.
News March 18, 2025
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్‌కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.